ఆది పినిశెట్టి 'యూ టర్న్' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ' యూ టర్న్ '.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది.. ఓ మర్డర్ మిస్టరీ ని చేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.. ఈ సినిమాలో సమంత ఇన్వెస్టివ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన సమంత ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది..
తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా కి పవన్ కుమార్ దర్శకుడు.. భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ పతాకాలపై శ్రీనివాస్ చిత్తూరి మరియు రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసే పని లో ఉండగా, ఆ తర్వాత సాంగ్స్ ని చిత్రీకరించబోతున్నారు.. సెప్టెంబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..
తారాగణం: సమంత, ఆది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, నరైన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments