'యు' ఈ నెల 14న రిలీజ్

  • IndiaGlitz, [Monday,December 03 2018]

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'యు'. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా నిర్మాత‌. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు. హిమాన్షి కాట్ర‌గ‌డ్డ, స్వప్నా రావ్ నాయిక‌లు . ఈ చిత్రం ఈ నెల 14 న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు కొవెర మాట్లాడుతూ 'యు' టైటిల్‌కి క‌థే హీరో. నేను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి ద‌గ్గ‌ర నాలుగేళ్లు ప‌నిచేశాను. క‌థా ప‌రంగా ఉన్న అనుభ‌వంతో 'యు' రాసుకున్నాను. శుభ‌లేఖ సుధాక‌ర్‌గారు, త‌నికెళ్ల భ‌ర‌ణిగారు క‌థ విన‌గానే చేస్తాన‌ని న‌న్ను ప్రోత్స‌హించారు. ప‌ల్లెటూరిలో మొద‌లై అండర్ వ‌ర‌ల్డ్ లో ఎండ్ అయ్యే క‌థ ఇది. 80 ఏళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ప్రాజెక్ట్ ఇది. ఈ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయాల్సిన సినిమా ఇది. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేక కోటి రూపాయలతో తీసాం. ఈ సినిమా మొత్తం హీలియ‌మ్ 8కె కెమెరా తో తీశాం. ఇండియాలో ఇదే తోలి సినిమా అని అన్నారు.

శుభ‌లేఖ సుధాక‌ర్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు నా పాత్ర మీద ప్రేమ పెంచుకుని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌థ చెప్పారు అని చెప్పారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చారు కొవెర‌. అత‌నికి మ‌ద్ధ‌తుగా నిలిచిన అత‌ని త‌ల్లికి, భార్య‌కి అభినంద‌న‌లు. నా ద‌గ్గ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ను శుభ‌లేఖ‌ను సుధాక‌ర్ నా ద‌గ్గ‌ర‌కు పంపారు. చాలా ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రూ చాలా బాగా చేశారు. వాళ్ల కృషికి, వాళ్ల త‌ప‌న‌కు సినిమా పెద్ద విజ‌యం కావాలి అని అన్నారు.

నిర్మాత విజ‌య‌ల‌క్ష్మీ కొండా మాట్లాడుతూ ర‌వితేజ ఏదో సినిమాలో అడిగిన‌ట్టు, నా కొడుకు ప్ర‌తిరోజూ న‌న్ను 'ఒక్క చాన్స్ అమ్మా' అని అడిగేవాడు. మాకు రామారావు, నాగేశ్వ‌ర‌రావు, చిరంజీవి అంటే ఇష్టం. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా స‌క్సెస్ అవుతుందో లేదో తెలియ‌దు కానీ, మా అబ్బాయి ప‌డ్డ క‌ష్టానికి ఓ గుర్తింపు రావాల‌న్న‌దే నా కోరిక‌. అని చెప్పారు.

కెమెరామేన్ మాట్లాడుతూ కెమెరా క‌న్నా క‌థే ఈ సినిమాకు హీరో. ద‌ర్శ‌కుడితో క‌లిసి నేను చాలా యాడ్స్ చేశా. క‌ల‌రిస్ట్ గా కొన్ని సినిమాలు చేశా. 'యు' అనేది టైటిల్ సింగిల్ లెట‌రే, కానీ స్టోరీగా ఆలోచిస్తే చాలా పెద్ద‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. సెకండాఫ్‌లో డిఫ‌రెంట్ మూడ్‌లో ఉంటుంది. డిఫ‌రెంట్ మూడ్స్ ఆఫ్ క‌ల‌ర్ కూడా ఉంటుంది అని చెప్పారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాఘ‌వ‌, నాగి, రోహిణి, సంధ్య‌, స్వ‌ప్న రావ్‌, ల‌హ‌రి, దొర‌బాబు, కోయ కిశోర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు.ఈ సినిమాకు కెమెరా: రాకేశ్ గౌడ్‌, సంగీతం: స‌త్య మ‌హ‌వీర్‌, ఎడిటింగ్‌: అమ‌ర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే: మ‌ధు విప్ప‌ర్తి, మాట‌లు: మ‌హి ఇల్లింద్ర‌, క‌రుణ్ వెంక‌ట్‌, ఆర్ట్: జ‌యదేవ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగ శివ గ‌ణ‌ప‌ర్తి, స‌హ నిర్మాత‌: మూర్తి నాయుడు పాదం.

More News

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. 'U/A' స‌ర్టిఫికేట్.. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఫైన‌ల్ షెడ్యూల్‌లో 'ఎన్‌.జి.కె'.. కొత్త రిలీజ్ డేట్‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రీమేకే అయినా వీలైనంత కొత్త‌గా...

తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన 'టెంప‌ర్' చిత్రాన్ని హిందీలో 'సింబా' పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సారా ఆలీఖాన్ హీరోయిన్‌గా న‌టించింది.

14న అత్యంత భారీ స్థాయిలో 'ఆక్వామేన్' 

జేస‌న్ మ‌మోవా, అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం 'అక్వామేన్' . జేమ్స్ వాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. యాక్ష‌న్ ప్యాక్డ్ అడ్వంచ‌ర‌స్  చిత్ర‌మిది. జేస‌న్ మ‌మోవా టైటిల్ రోల్‌లో క‌నిపిస్తారు.

క‌ల్యాణ్ రామ్ '118' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. మ‌రో ప‌క్క వైవిధ్య‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.