కేసీఆర్ కేబినెట్‌‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అవకాశం కల్పించలేదు. దీంతో ‘ఆమె’కు కేసీఆర్ మరోసారి అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. అంతేకాదు శుక్రవారం నాడు అసెంబ్లీ వేదికగా సభ్యులందరి ముందు మహిళలకు కేబినెట్‌‌లో ఎందుకు చోటు కల్పించలేదు..? అని సీఎంను.. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

ఇందుకు స్పందించిన కేసీఆర్.. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. మొత్తం ఆరుగురిని తీసుకుంటున్నాని.. వారిలో ఇద్దరు మహిళలు ఉంటారని గులాబీ బాస్ స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం వల్లనే తమ పార్టీ అధికారం నిలబెట్టుకుందని, వారిని విస్మరించే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. గత కేబినెట్లో మహిళలను తీసుకోకపోవడానికి ప్రత్యేక కారణాలేమీ లేవని పేర్కొన్నారు. సో మొత్తానికి చూస్తే ఆడపడుచులకు కేబినెట్‌‌లో అవకాశం ఇవ్వలేదు అనే అపవాదును కేసీఆర్ త్వరలోనే చెరుపుకోబోతున్నారన్న మాట.

ఇంతకీ ఆ ఇద్దరు అదృష్టవంతులెవరు..!?

కేసీఆర్ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను కేబినెట్‌లో తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..? ఎమ్మెల్యేలుగా పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీతలలో ఎవర్ని కేబినెట్‌‌లోకి తీసుకోబోతున్నారు..? ఇంతకీ కేసీఆర్ కేబినెట్‌‌లోకి ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరు..? అని ఏ ఇద్దరు కలుసుకున్నా రాష్ట్రంలో ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. పద్మాదేవేందర్ రెడ్డి, రేఖా నాయక్‌‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

More News

టికెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అటు వైసీపీ.. ఇటు టీడీపీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎయిర్ షో లో అగ్నిప్రమాదం.. 300 కార్లు బుగ్గి

బెంగళూరులోని యలహంకలో రిహార్సల్స్ చేస్తున్న రెండు రెండు సూర్యకిరణ్‌ విమానాలు కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి'

సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కారం.

కార్తితో హిట్ బాంబ్.. క‌లిసొచ్చేనా?

హీరో కార్తికి రీసెంట్‌గా విడుద‌లైన దేవ్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది.

త‌లైవా అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో