సవ్యసాచి.. భూమిక పాత్ర కోసం రెండు వెర్షన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య, యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సవ్యసాచి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భూమికా చావ్లా, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా జూలైలో తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాలో నాగచైతన్యకి అక్క పాత్రలో నటిస్తున్న భూమిక పాత్రకి సంబంధించి ఎలాంటి ముగింపు ఇవ్వాలనే విషయంలో దర్శకుడు చిన్నపాటి కన్ఫ్యూజ్లో ఉన్నారట. సినిమాలో భాగంగా.. భూమికపై ఓ బాంబ్ బ్లస్ట్ సీన్ ఉంటుందట. అయితే.. ఆ తరువాత ఆ పాత్రని చంపేయాలా? లేక కోమాలోకి తీసుకెళ్ళలా అనే విషయంలో క్లారిటీ రాకపోవడంతో.. రెండు వెర్షన్స్లోనూ షూట్ చేశారని తెలుస్తోంది. మరి.. సినిమాలో ఏ వెర్షన్ ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments