స‌వ్య‌సాచి.. భూమిక పాత్ర కోసం రెండు వెర్ష‌న్లు

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. స‌వ్య‌సాచి పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో భూమికా చావ్లా, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ సినిమా జూలైలో తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కి అక్క పాత్ర‌లో న‌టిస్తున్న భూమిక పాత్ర‌కి సంబంధించి ఎలాంటి ముగింపు ఇవ్వాలనే విష‌యంలో ద‌ర్శ‌కుడు చిన్న‌పాటి క‌న్‌ఫ్యూజ్‌లో ఉన్నార‌ట‌. సినిమాలో భాగంగా.. భూమిక‌పై ఓ బాంబ్ బ్ల‌స్ట్ సీన్ ఉంటుంద‌ట‌. అయితే.. ఆ త‌రువాత ఆ పాత్ర‌ని చంపేయాలా? లేక కోమాలోకి తీసుకెళ్ళ‌లా అనే విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో.. రెండు వెర్ష‌న్స్‌లోనూ షూట్ చేశార‌ని తెలుస్తోంది. మ‌రి.. సినిమాలో ఏ వెర్ష‌న్ ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

More News

సిక్స్ ప్యాక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఫైట్ సీక్వెన్స్‌

రంగ‌స్థ‌లం ఘ‌న‌విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది.

త‌మ‌న్నాకి మ‌ళ్ళీ క‌లిసొస్తాయా?

తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ నాయిక‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది త‌మ‌న్నా.

స‌మంత ఆ ట్రాక్ రికార్డు సొంతం చేసుకుంటుందా?

అఆ, జ‌న‌తా గ్యారేజ్‌, రాజుగారి గ‌ది2, మెర్స‌ల్ (అదిరింది), రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, ఇరుంబు తిరై (అభిమ‌న్యుడు).. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది అందాల న‌టి స‌మంత‌.

అప్పుడు 'బాహుబలి'.. ఇప్పుడు 'సైరా'

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది తమన్నా.

మెగాస్టార్ ముఖ్య అతిథిగా 'తేజ్‌ ఐ లవ్ యు' ఆడియో

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో