Dimple Hayathi: డీసీపీతో వివాదం.. హీరోయిన్ డింపుల్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు, కుక్క తరమడంతో
Send us your feedback to audioarticles@vaarta.com
డింపుల్ హయాతి..గత నాలుగు రోజులుగా వార్తల్లో నానుతోన్న పేరు. తన పని తాను కామ్‌గా చేసుకుంటూ వెళ్లే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఐపీఎస్‌తో వివాదం కారణంగా ఏకంగా పోలీస్ స్టేషన మెట్లెక్కాల్సి వచ్చింది. డీసీపీపై కోర్టుకెళ్లే యోచనలో వున్నారు డింపుల్. ఇలాంటి పరిస్ధితుల్లో ఆమె ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించేందుకు విఫలయత్నం చేయడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్ కలిసి వుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం సదరు అపార్ట్మెంట్లోకి ఓ యువతి, యువకుడు సీ2లో వుండే డింపుల్ నివాసంలోకి వెళ్లారు. వారు అనుమానాస్పదంగా వుండటంతో పనిమనిషి ఎవరని అడిగింది. ఈలోగా ఇంట్లోని కుక్క మొరుగుతూ వారి ఇంట్లోకి వెళ్లడంతో ఇద్దరూ పరిగెత్తుతూ లిఫ్ట్‌లోకి వెళ్లారు. వారిని వెంబడిస్తూ కుక్క కూడా లిఫ్ట్ వైపు వెళ్లింది.
తామిద్దరం డింపుల్ అభిమానులమన్న యువతీ, యువకులు :
దీని గురించి తెలుసుకున్న డింపుల్ వెంటనే 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిద్దరిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. తాము రాజమండ్రి నుంచి వచ్చామని డింపుల్ అభిమానులమని తెలిపారు. ప్రస్తుతం డీసీపీతో వివాదం నేపథ్యంలో ఆమెను కలిసేందుకు వచ్చామని పేర్కొన్నారు. దీంతో పోలీసులు విషయాన్ని డింపుల్‌కు చెప్పడంతో వారిని విడిచిపెట్టాల్సిందిగా ఆమె సూచించారు. అనంతరం పోలీసులు వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వారిని కొప్పిశెట్టి సాయిబాబు, శృతిగా గుర్తించారు.
డింపుల్ ఆమె సన్నిహితుడిపై పోలీస్ కేసు :
ఇదిలావుండగా.. డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టి అనుచితంగా ప్రవర్తించిన కేసులో సినీనటి డింపుల్ ఆమె సన్నిహితుడు విక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో డీసీపీపై డింపుల్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రోడ్డు మీద వుండాల్సిన సిమెంట్ దిమ్మెలు, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎందుకు వచ్చాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. డీసీపీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని.. విషయం కోర్టులోనే తేల్చుకుంటానని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments