బన్నీ బర్త్‌డే సందర్భంగా ఒకటి కాదు రెండు సర్‌ప్రైజ్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే చాలు.. అభిమానులు అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూస్తారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగా అప్‌డేట్ ఉంటే ఓకే.. లేదంటే రచ్చ రచ్చే. అలాగే స్టార్ హీరో అల్లు అర్జున్‌కి అటు టాలీవుడ్‌లోనే కాకుండా కేరళలో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయనను మల్లు అర్జున్ అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఈ హీరో బర్త్‌డే త్వరలో అంటే ఏప్రిల్ 8న రాబోతోంది. మరి చిత్ర యూనిట్ ఏం ఇవ్వబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
గతేడాది `అల వైకుంఠపురములో..` సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప` టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. ఆగస్ట్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమచారం.
ఇంతటితో అయిపోలేదు. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా మరో సర్‌ప్రైజ్ కూడా ఉందని టాలీవుడ్ టాక్. `పుష్ప` తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి బన్నీ ఓ సినిమాలో నటించున్నాడు. `పుష్ప` విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బన్నీ ఫ్యాన్స్‌కు ఆయన బర్త్‌డే రోజున డబుల్ ధమాకా ఉండబోతున్నట్టే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com