బాల‌య్య ఎటు వైపు మొగ్గుతాడు?

  • IndiaGlitz, [Friday,March 13 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న 106వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుం సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది. బోయ‌పాటి శ్రీను సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు బాల‌కృష్ణ కోసం రెండు క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయ‌ట‌. అందులో ఒక‌టి రైట‌ర్ చిన్నికృష్ణ రాశాడు. న‌ర‌సింహ‌నాయుడు క‌థ‌ను ఈయ‌నే అందించాడు. కాగా మ‌రో క‌థ‌ను మ‌రో రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా రాశాడ‌ట‌. రెండు మాస్ ఇమేజ్ ఉన్న క‌థ‌లే కావ‌డం విశేషం.

ఈ రెండు క‌థ‌లు బాల‌కృష్ణ‌కు న‌చ్చాయ‌ట‌. మ‌రి ఈ రెండింటిలో బాల‌య్య ఏ క‌థ‌కు మొగ్గు చూపుతాడో తెలియ‌డం లేదు. ఒక క‌థ‌తో బి.గోపాల్ సినిమాను ముందు చేసి.. మ‌రో క‌థ‌తో మ‌రో ద‌ర్శ‌కుడితో చేస్తాడో ఏమో తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం బాల‌య్య 106వ సినిమాపైనే ఫోకస్‌డ్‌గా ఉన్నాడు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయపాటి కాంబినేష‌న్లో వ‌స్తోన్న చిత్ర‌మిది. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర అఘోరా అని టాక్‌.

More News

ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: రాఘ‌వేంద్ర‌రావు

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు.

రేవంత్‌కు అధ్యక్ష పదవి కష్టమే.. తొక్కేస్తున్నారే..!?

రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

నెల్లూరు వాసికి కరోనా.. థియేటర్స్ బంద్

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో

'అన్నపూర్ణమ్మ గారి మనవడు'తో మ‌ళ్ళీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా - బాలాదిత్య

నా పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. అన్నారు బాలాదిత్య. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం

జేసీ బ్రదర్స్ ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయారేం!?

సర్పంచ్‌గా పోటీ చేసిన వ్యక్తి రేపొద్దున ఏ ఎంపీటీసీనో.. జడ్పీటీసీనో.. లేకుంటే అంతకుమించి ఏదైనా కోరుకుంటారు.