బాలయ్య ఎటు వైపు మొగ్గుతాడు?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రస్తుం సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. బోయపాటి శ్రీను సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం వినపడుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయట. అందులో ఒకటి రైటర్ చిన్నికృష్ణ రాశాడు. నరసింహనాయుడు కథను ఈయనే అందించాడు. కాగా మరో కథను మరో రైటర్ సాయిమాధవ్ బుర్రా రాశాడట. రెండు మాస్ ఇమేజ్ ఉన్న కథలే కావడం విశేషం.
ఈ రెండు కథలు బాలకృష్ణకు నచ్చాయట. మరి ఈ రెండింటిలో బాలయ్య ఏ కథకు మొగ్గు చూపుతాడో తెలియడం లేదు. ఒక కథతో బి.గోపాల్ సినిమాను ముందు చేసి.. మరో కథతో మరో దర్శకుడితో చేస్తాడో ఏమో తెలియడం లేదు. ప్రస్తుతం బాలయ్య 106వ సినిమాపైనే ఫోకస్‌డ్‌గా ఉన్నాడు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర అఘోరా అని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com