‘కె.జి.యఫ్‌ చాప్టర్ 2’లో ఇద్దరు స్టార్స్‌ ఎంట్రీ

  • IndiaGlitz, [Monday,February 10 2020]

‘బాహుబలి’ పాన్‌ ఇండియా మూవీగా ఎంతటి సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత యష్‌ హీరోగా నటించిన కన్నడ చిత్రం కె.జి.యఫ్‌ చిత్రంలో మొదటి భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ కూడా పాన్‌ ఇండియా సినిమాగానే విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కె.జి.యఫ్‌ చిత్రంలో రెండో భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ సినిమాను అంచనాలకు ధీటుగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలను కూడా ఈ సినిమాలో యాడ్‌ చేశారు. ఇపటికే అధీర అనే విలన్‌ పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఇందిరాగాంధీని పోలిన మహిళా రాజకీయ నేత రమికామసేన్‌గా రవీనాటాండన్‌ నటిస్తున్నారు. ఈమెతో పాటు టాలీవుడ్‌లో విలక్షణ పాత్రలను పోషిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పిస్తున్న రావు రమేశ్‌ కూడా ఈ సినిమా యూనిట్‌తో జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌1’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన రూ.200కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో రెండో భాగం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా జూలై 30న విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌' వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఆ తేదికే కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2ను విడుదల చేసేలా యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంటోంది.

More News

తాత అయిన వ‌ర్మ‌.. రాజ‌మౌళి ట్వీట్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడే మాట‌లు వింటే అస‌లు బంధాలు, బాంధ‌వ్యాలు పైన ఎలాంటి న‌మ్మ‌కం లేని వ్య‌క్తితో మ‌నం మాట్లాడుతున్న‌ట్లు అనిపిస్తుంది.

సింగర్‌ మనోపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

మీటూ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు దక్షిణాదిలో సింగర్‌ చిన్మయి రైటర్‌ వైరముత్తుపై చేసిన ఆరోపణలు సంచలనాలకు దారి తీశాయి.

ఇండియ‌న్ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఫ్రెండ్ షిప్'

ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు.

రాహు శాటిలైట్ & డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న జి తెలుగు

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

45 ల‌క్ష‌ల మోసం.. యాంక‌ర్ రవి కంప్లైంట్‌

బుల్లి తెర‌పై షోస్ ద్వారా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ర‌వి ఇది మా ప్రేమ‌క‌థ అనే చిత్రంలోనూ న‌టించారు.