ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి ఒకేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఒకే టైంలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన కాజల్ అగర్వాల్, సమంత.. ఇప్పటికే రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ రెండు చిత్రాలలో ఒకటి హిట్ అయితే.. మరో సినిమా ఫ్లాప్ అయింది. హిట్ అయిన మూవీ బృందావనం అయితే.. ఫ్లాప్ అయిన మూవీ బ్రహ్మోత్సవం. అలాగే సమంత హీరోయిన్గా నటించిన జనతా గ్యారేజ్‌లోనూ కాజల్ స్పెషల్ సాంగ్ చేసింది. కట్ చేస్తే.. ఈ ఇద్దరు మరో సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆ సినిమానే తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మెర్సల్.
విజయ్ పక్కన హీరోయిన్గా నటించడం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఇది మూడోసారి. కాజల్ ఇప్పటికే తుపాకీ, జిల్లా చిత్రాలతో విజయ్ కి హిట్ పెయిర్‌గా నిలిస్తే.. సమంత ఏమో కత్తి, తెరి చిత్రాలతో అతనికి రెండుసార్లు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి విజయ్ తో నటిస్తూ హ్యాట్రిక్ కోసం చేస్తున్న ప్రయత్నం.. ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments