ఇంద్రసేన కి రెండు పాటలు బాకీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిచ్చగాడుతో తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోని.. ప్రస్తుతం ఇంద్రసేన అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవి చేతుల మీదుగా ఆ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ ఆంటోని అన్నదమ్ములుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. టాకీ పార్ట్‌ని పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉందని, వాటిని త్వరలోనే చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
డయానా చంపక్, మహిమా, జ్యూయెల్ మేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ నిర్మిస్తుండగా.. విజయ్ ఆంటోని సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవంబర్‌లో ఇంద్రసేన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com