ఒకే రోజు.. రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రాలు ఒకే రోజు సందడి చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు నటించిన 24వ చిత్రం భరత్ అనే నేను ఏప్రిల్ 27న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా అదే రోజున రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇవి రెండు కూడా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీస్ కావడం విశేషం.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భరత్ అనే నేనులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండగా.. వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో బన్ని ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ రెండు చిత్రాలకి సంబంధించి ఓ విశేషముంది. అదేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ సీనియర్ తమిళ కథానాయకుడు శరత్ కుమార్ కీలక పాత్రలు చేయడం. గతంలో మహేష్ బాలనటుడిగా నటించిన బాలచంద్రుడులో శరత్ కుమార్ విలన్‌గా నటించగా.. అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్ని సినిమాలో శరత్ కుమార్ తండ్రి పాత్రలో కనిపించారు. రెండోసారి ఆయా హీరోల చిత్రాల్లో నటిస్తున్న వైనం.. మరో సారి శరత్ కుమార్ కికలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com