భారత్‌లో అడుగుపెట్టిన ‘‘ఒమిక్రాన్’’.. కర్ణాటకలో రెండు కేసులు గుర్తింపు, కేంద్రం అప్రమత్తం

  • IndiaGlitz, [Thursday,December 02 2021]

అనుకున్నదంతా అయ్యింది ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇండియాలో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆయన చెప్పారు. వైరస్‌ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్‌ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించామని.. ఒమిక్రాన్‌ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నామని చెప్పారు. అయితే, వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని..  దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. వారంవారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 15 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ.. 18 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందన్నారు.  గతి తెలిసిందే.

కాగా.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నాటి నుంచి నేటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు పేర్కొంది.  దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
 

More News

'పంచనామ' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో

'రామ్ అసుర్' సినిమాతో నటుడిగా  మంచి గుర్తింపు వచ్చింది: అభినవ్ సర్దార్

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ఇటీవల విడుదలైన 'రామ్ అసుర్' తన కెరీర్‌లో బిగ్ సక్సెస్ అందుకున్నారు.

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను పరిచయం చేసుకుని వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరి బాగోతంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

మ‌హేష్ బాబుకి స‌ర్జ‌రీ.. ‘‘సర్కార్ వారి పాట’’కి కొద్దిరోజుల పాటు బ్రేక్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోనున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో .. మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకోవడంతో ఫైనల్ బెర్త్‌ల కోసం టాస్క్‌లు మొదలయ్యాయి.