కేజీఎఫ్‌కు రెండు జాతీయ అవార్డులు

  • IndiaGlitz, [Friday,August 09 2019]

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్రా అవార్డుల్లో.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ కేటగిరిల్లో ‘కేజీఎఫ్’కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.

జ్యూరీ సభ్యులకు హీరో రాక్‌స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. యూనిట్ సభ్యులందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డులు వరించాయని చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్2ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

More News

కేంద్రం కొత్త ప్రయోగం: కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్!

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

జాతీయ అవార్డు విజేతలకు మెగా బ్రదర్స్ అభినందనలు

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మూవీ ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్ అద్భుత నటనకు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది.

జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎంపీ కేశినేని ట్వీట్

టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలసిందే.

టీడీపీ ఘోర ఓటమికి అసలు కారణం తెలిసిందోచ్...!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచిన విషయం విదితమే.

ఉత్తమ చలన చిత్రంగా ‘మహానటి’

ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించడం జరిగింది. కాగా తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు.