ఒక రోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు
- IndiaGlitz, [Friday,June 15 2018]
మెలోడీ సాంగ్స్‌తో తెలుగుసినీ సంగీత ప్రియులను అలరించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గోపీ సుందర్.. అనతి కాలంలోనే మెలోడీ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే గోపీ సుందర్ సంగీతమందించిన 'తేజ్ ఐ లవ్ యు' చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. వీటికి మంచి స్పందన వస్తోంది.అలాగే గోపీ స్వరాలు అందించిన మరో చిత్రం 'పంతం' ఆడియో కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా కేవలం ఒక రోజు గ్యాప్‌లో రాబోతున్నాయి. గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన పంతం జూలై 5న విడుదల కానుండగా.. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'తేజ్ ఐ లవ్ యు' జూలై 6న రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా తనకు మంచి గుర్తింపు తీసుకువస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు గోపీసుందర్.