రెండు చిత్రాలు..నలుగురు సంగీత దర్శకులు..
Send us your feedback to audioarticles@vaarta.com
డార్లింగ్.. ఈ మాట వింటే గుర్తొచ్చే కథానాయకుడు ప్రభాస్. అందర్నీ డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పలకరించే ప్రభాస్.. 'బాహుబలి'తో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'బాహుబలి' తరువాత రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడీ డార్లింగ్. వాటిలో ఒకటి 'సాహో'. దీనికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకుడు. ఈ చిత్రం తరువాత 'జిల్' డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు చిత్రాలకూ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లే సంగీతమందించనుండడం విశేషం.
'సాహో' చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకత్రయం శంకర్ - ఎహసాన్-లాయ్ మ్యూజిక్ అందించనుండగా.. మరో చిత్రానికి అమిత్ త్రివేది అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతమందించనున్నారు. అంటే ఈ రెండు చిత్రాలకు నలుగురు సంగీత దర్శకులు పనిచేయనున్నారన్నమాట. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతమందించిన దక్షిణాది సినిమాలు 'అభయ్'ఆశించిన విజయం సాధించలేదు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టంస మంచి విజయాన్నే సాధించింది. సాహో'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి. ఇక అమిత్ త్రివేదికిదే తొలి తెలుగు చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout