ఒకేసారి రెండు సినిమాలు

  • IndiaGlitz, [Monday,August 20 2018]

ఇటీవ‌ల విడుద‌లైన 'పంతం'తో పాతిక సినిమాలను పూర్తి చేసుకున్న గోపీచంద్‌.. కాస్త గ్యాప్ తీసుకుని సినిమాల‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఇప్పుడు గోపీచంద్ ఏక‌కాలంలో రెండు సినిమాల‌ను చేయ‌బోతున్నాడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో కుమార్ అనే కొత్త ద‌ర్శకుడి ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నాడు.

కాగా.. మ‌రో సినిమా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నుంది. సాహ‌సం త‌ర్వాత గోపీచంద్ బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేస్తుండ‌గా.. గౌత‌మ్ నంద త‌ర్వాత సంప‌త్ నందితో క‌లిసి చేస్తున్న మ‌రో సినిమా త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్‌.. కోరిక‌ను ఈ సినిమాలైన తీరుస్తాయేమో చూడాలి.