అల్లరి నరేష్.. రెండు కొత్త చిత్రాలు

  • IndiaGlitz, [Friday,December 22 2017]

ఇటీవ‌లే మేడ మీద అబ్బాయ్ గా ప‌ల‌క‌రించాడు హాస్య చిత్రాల క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేష్‌. ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌న త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు న‌రేష్‌. కాగా, తాజాగా అల్ల‌రి న‌రేష్ రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌టి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావు చిత్రం కాగా.. మ‌రొక‌టి నందిని న‌ర్సింగ్ హోమ్ ఫేమ్ గిరితో చేయ‌బోతున్న సినిమా.

సుడిగాడు త‌రువాత భీమినేని ద‌ర్శ‌క‌త్వంలో అల్ల‌రి న‌రేష్ న‌టించ‌బోయే చిత్రాన్ని కొత్త నిర్మాత‌లు నిర్మించ‌నుండ‌గా.. గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్ల‌రి న‌రేష్ న‌టించ‌నున్న కొత్త చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటితో పాటు మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రంలోనూ అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌ని స‌మాచార‌మ్‌. త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతాయి.

More News

బాహుబలి రీమేక్ వస్తోంది

బాహుబలి,బాహుబలి 2 చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ

నయనతార పాత్ర పేరేమిటంటే..

సింహా,శ్రీ రామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ,కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో

ప‌వ‌న్.. ఆ రెండు ఒకేలా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. విడుద‌ల‌ రోజు థియేటర్ల వ‌ద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

మెగా హీరో చిత్రంలో రమ్యకృష్ణ?

చక్రవర్తి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ..