రాజశేఖర్ చిత్రంలో మరో ఇద్దరు ...
Send us your feedback to audioarticles@vaarta.com
`పి.ఎస్.వి.గరుడవేగ` చిత్రం తర్వాత డా.రాజశేఖర్ హీరోగా `అ!` ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో `కల్కి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్‌తో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మాతలుగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి. త్వరలోనే సెట్స్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో ఇప్పటికే నందితా శ్వేత నటిస్తుంది.
లేటెస్ట్‌న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ఇప్పుడు ఆదాశర్మ, స్పెషల్ సాంగ్‌లో స్కార్లెట్ విలన్స్ కూడా నటించబోతున్నారు. హార్ట్ ఏటాక్, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం చిత్రాల్లో నటించిన ఆదా శర్మ ఇటీవల చార్లి చాప్లిన్ 2 చిత్రంలో ప్రభుదేవాతో నటించింది. మళ్లీ ఇప్పుడు తెలుగులో నటించడానికి రెడీ అయ్యింది. ఆదాశర్మ మెయిన్ లీడ్‌గా నటిస్తుంటే.. నందితా శ్వేత కీలక పాత్రలో నటిస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments