Two MLAs:బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!

  • IndiaGlitz, [Monday,December 04 2023]

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కన్నా నాలుగు స్థానాలు ఎక్కువ గెలుచుకుంది. మిత్రపక్షం సీపీఐ ఓ స్థానంలో గెలవడంతో 65 స్థానాలు గెలిచినట్లైంది. మరోవైపు ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్టీ రిజర్వుడ్ అయిన భద్రాచలం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొందారు.

ఇక హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై గెలిచిన కౌశిక్ రెడ్డి కూడా ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. వీరితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో మహేశ్వరం నుంచి గెలిచిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కూకట్‌పల్లి నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ నుంచి గెలిచిన వివేక్ గౌడ్, శేరిలింగంపల్లి నుంచి గెలిచిన అరికపూడి గాంధీ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

మరోవైపు హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిపై నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ను కలవనుంది. ఇవాళ సాయంత్రానికి రాజ్‌భవన్‌లో సీఎంతో పాటు ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 300 మంది వరకు పాల్గొనేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 9లోపు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.

More News

Bigg Boss Telugu 7 : ప్రశాంత్ సేఫ్ గేమ్ , బిగ్‌బాస్ నుంచి గౌతమ్ ఎలిమినేట్ .. అర్జున్ బతికిపోయాడన్న నాగార్జున

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.

Helicopter Crashed:బ్రేకింగ్: తూప్రాన్‌లో కూలిన శిక్షణ హెలికాఫ్టర్.. ఇద్దరు మృతి

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది.

Parliament:నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 22 వరకూ కొనసాగనున్నాయి.

KCR:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం 65 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.

KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఓటమి..

కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్,