close
Choose your channels

జనసేనకు ప్రచారం చేయనున్న ఇద్దరు మెగా హీరోలు!

Thursday, April 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేనకు ప్రచారం చేయనున్న ఇద్దరు మెగా హీరోలు!

ఏపీలో ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండటంతో అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏకంగా పార్టీల అధిపతులే రోజుకు నాలుగైదు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు జనసన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో మోసపోయిన తాను ఈసారి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మి నారాయణ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని 125 సీట్లు గెలబోతున్నామని జోస్యం చెప్పుకున్నారు.

చిరు ఇక రారు..!

ఇక అసలు విషయానికొస్తే.. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు సినిమా కలరింగ్ మస్తుగానే ఉంది. అంతేకాదు స్టార్ క్యాంపెయినర్లుగా ఇప్పటికే రంగంలోకి సుమారు 10, 12 నియోజకవర్గాలకు పైగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటి వరకూ జనసేన తరఫున మాత్రం ఎవ్వరూ రాలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని మెగాభిమానులు భావించారు కానీ గురువారం మధ్యాహ్నం ప్రచార సభా వేదికగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఆయన ప్రచారానికి రారు.. రాజకీయాలు వదిలేశారని తేల్చిచెప్పారు.

నాగబాబు కోసం కుమార్తె, భార్య!

నర్సాపురం ఎంపీ అభ్యర్థి అయిన నాగబాబు కోసం కుమార్తె, మెగా డాటర్ నీహారిక, ఆయన సతీమణి పద్మజ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇక మరికొంత మంది పీఆర్వోలు సైతం ప్రచార బరిలోకి దిగి పార్టీకోసం కృషి చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరూ నాలుగు గోడలను వదిలి నలుగురిలోకి రాకపోవడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఎట్టకేలకు రంగంలోకి దిగాలని మెగా హీరోలు ఇద్దరు భావిస్తున్నారు.

ఇద్దరొస్తున్నారు..!

ఇటీవల నాగబాబు భార్య పద్మజ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పార్టీ కోసం ప్రచారం చేస్తారని తెలిపారు. ఈ విషయం స్వయానా పద్మజనే చెప్పడంతో అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు వరుణ్ అభిమానుల్లో కాసింత అసంతృప్తి తగ్గినట్లేనని చెప్పుకోవచ్చు. ఇక మెగాభిమానులకు మాత్రం ఎక్కడో కొరత అనేది ఉండక తప్పదు మరి. ఈ ఇద్దరు ఏ మాత్రం ప్రచారం చేస్తారో..? ఎన్ని ఓట్లు జనసేనకు పట్టుకొస్తారో..? తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment