ఒకే నెల‌లో రెండు మెగా ఫ్యామిలీ చిత్రాలు

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కుల చిత్రాలు.. ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రిగే విష‌య‌మే. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ఇంటిలిజెంట్‌, వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమ.. ఒక రోజు గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మ‌రోసారి అటుఇటుగా ఇలాంటి వ్య‌వ‌హార‌మే జూలై నెల‌లోనూ జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా క‌రుణాక‌ర‌న్ రూపొందించిన ప్రేమ‌క‌థా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాన్ని తొలుత జూన్ 29న విడుద‌ల చేయాల‌ని అనుకున్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల జూలై 6కి వాయిదా వేశార‌ని తాజాగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇక అదే నెల‌లో చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన తొలి చిత్రం విజేత విడుద‌ల కానుంది. అంటే.. ఒక‌ట్రెండు వారాల గ్యాప్‌లో మెగా ఫ్యామిలీకి చెందిన రెండు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయ‌న్న‌మాట‌.

More News

క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను పూర్తి చేసిన స‌మంత‌

'రంగ‌స్థ‌లం', 'మ‌హాన‌టి', 'అభిమ‌న్యుడు' చిత్రాల‌తో ఈ వేస‌విలో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల‌లో న‌టిస్తున్నారు.

మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

ఉత్త‌మ న‌టిగా ప‌లు అవార్డుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ది డ‌ర్టీ పిక్చ‌ర్‌తో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సాయిప‌ల్లవి?

'ఫిదా' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత 'ఎంసీఏ' చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

శ్రీరెడ్డి వ్య‌వ‌హారం నోరు విప్పిన నాని భార్య‌...

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో హాల్ చ‌ల్ చేసిన శ్రీరెడ్డి.. నేచురల్ స్టార్ నాని త‌న‌ను వాడుకుని వ‌దిలేశాడ‌ని.. రీసెంట్‌గా త‌న‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నాడ‌ని..