మహేష్ బాబు.. రెండు ఇంట్రస్టింగ్ టైటిల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం భరత్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న చిత్రమిది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు మహేష్. ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి రెండు ఇంట్రస్టింగ్ టైటిల్స్ వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి కృష్ణా ముకుందా మురారి కాగా.. మరొకటి హరేరామ హరేకృష్ణ. మరి ఈ రెండు పేర్లలో ఏది ఓకే అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కూడా దేవిశ్రీ ప్రసాద్‌నే స్వరాలు అందిస్తున్నారు. బృందావనం, ఎవడు, ఊపిరి వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com