కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారత్ ఫైలెట్లు సజీవ దహనం
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మంగళవారం తెల్లవారుజామున బాలకోటలోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రెండు యుద్ధవిమానాలు రాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తిప్పికొట్టడంతో తోక ముడిచి పారిపోయాయి. ఇదిలా ఉంటే పాక్ ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియల్కోట్ విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాక్ అధికారులు ప్రకటించారు.
బుధవారం ఉదయం కశ్మీర్‌లోని బుద్గాంలో భారత యుద్ధ విమానం సాంకేతిక సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భారీగా మంటలు వ్యాపించడంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు ప్రమాదస్థలిని పరిశీలించిన పోలీసు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు ఫైలెట్లు, ఒక పౌరుడు మరణించినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout