కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారత్ ఫైలెట్లు సజీవ దహనం

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

భారత్‌‌-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మంగళవారం తెల్లవారుజామున బాలకోటలోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌‌కు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రెండు యుద్ధవిమానాలు రాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తిప్పికొట్టడంతో తోక ముడిచి పారిపోయాయి. ఇదిలా ఉంటే పాక్‌ ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియల్‌కోట్ విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాక్ అధికారులు ప్రకటించారు.

బుధవారం ఉదయం కశ్మీర్‌‌లోని బుద్గాంలో భారత యుద్ధ విమానం సాంకేతిక సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భారీగా మంటలు వ్యాపించడంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు ప్రమాదస్థలిని పరిశీలించిన పోలీసు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు ఫైలెట్లు, ఒక పౌరుడు మరణించినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

'మ‌హ‌ర్షి' విడుదల తేదీ ఖరారు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'.

ఎయిర్‌ఫోర్స్ దెబ్బకు తోకముడిచిన పాక్ విమానాలు

బాలకోటలో జరిగిన ఉగ్రమూకల పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో అటు పాక్.. ఇటు ఉగ్రవాదులు భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు.

సీమ ముద్దుబిడ్డ జ‌గ‌న్ ఇవేం కనపడలేదా..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటన ముగిసింది.

బ‌న్ని సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగం పుంజుకుంటున్నాయి.

మ‌హానాయకుడు కోసం అదేశాలు వ‌చ్చేశాయి...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగం `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది.