ట్రూ సక్సెస్ దిశగా 'టు ఫ్రెండ్స్'
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి, రాయలసీమ ముద్దు బిడ్డగా, అనంతపురం ఆణిముత్యంగా అభివర్ణించబడే బహుముఖ ప్రజ్ఞాశాలి ముళ్ళగూరు ఆనంతరాముడు.. సినీ రంగ ప్రవేశం చేసి, నిర్మించిన వినోదభరిత వైవిధ్య కథా చిత్రం 'టు ఫ్రెండ్స్'. ట్రూ లవ్ అనేది ఉప శీర్షిక.
ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు రమేష్ నాయుడుతో కలిసి ఆనంతరాముడు ఈ చిత్రాన్ని నిర్మించారు. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 150 కేంద్రాల్లో ఈనెల 26న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా అనంతపురంలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న ధియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. స్వచ్చమైన స్నేహానికి నిర్వచనమిస్తూ.. హాస్యానికి పెద్ద పీట వేసి రూపొందించిన "టు ఫ్రెండ్స్" (ట్రూ లవ్) ట్రూ సక్సెస్ దిశగా సాగుతుండటం సంతోషంగా ఉందని నిర్మాత ముళ్లగూరు ఆనంతరాముడు రాముడు. తమ సంస్థ నిర్మించే తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com