మెగా ఫ్యాన్స్ కు ఒకే రోజు రెండు పండగలు...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యాన్స్ ఒకే రోజు రెండు పండగలు..రానున్నాయి. ఇంతకీ ఆ..రెండు పండగలు ఏమిటి..? అంటారా...? మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంతో తెరకెక్కిన కంచె చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. వరుణ్ తేజ్ కి కంచె చిత్రం మంచి పేరు తీసుకువస్తుందని అక్టోబర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. కంచె చిత్రం రిలీజ్ కావడం మెగా ఫ్యాన్స్ కు ఒక పండగ అయితే మరో పండగ రామ్ చరణ్ బ్రూస్ లీ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు. దానయ్య నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ తెరపై బ్రూస్ లీ చిత్రంతో దర్శనమిస్తున్నారు. దీంతో బ్రూస్ లీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బ్రూస్ లీ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా..అక్టోబర్ 2 మెగా ఫ్యాన్స్ కు రెండు పండగలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com