ఒకే సినిమా.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు

  • IndiaGlitz, [Friday,June 05 2020]

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్‌2 చిత్రాల‌తో వ‌రుస హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దీని త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ ఎఫ్‌3 సినిమా చేస్తాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు వ‌రుణ్ తేజ్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వుతుంద‌ట‌.

ఇంత‌కూ వ‌రుణ్ తేజ్ నటించ‌బోయే సినిమా ఏంటో తెలుసా! దీనికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు చేతులు క‌లుపుతున్నార‌ట‌. వివ‌రాల మేర‌కు డైరెక్ట‌ర్ క్రిష్‌తో వ‌రుణ్‌తేజ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న నిర్మాణంలో ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. సురేంద‌ర్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో క్రిష్‌, వ‌రుణ్ తేజ్ ఓకే చెప్పేశార‌ట‌. ఇప్పుడు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీతో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంది.