సైజ్ జీరో కి టు డిఫరెంట్ సెన్సార్ సర్టిఫికెట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల అనుష్క నటించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కొవెలమూడి దర్శకత్వం వహించారు. పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో నిర్మించింది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సైజ్ జీరోను రిలీజ్ చేయనున్నారు. అయితే సైజ్ జీరో తెలుగులో ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ తెలుగులో యు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇక తమిళ్ లో సెన్సార్ బోర్డ్ అయితే క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక చిత్రానికి తెలుగులో ఒకరకంగా తమిళ్ లో మరో రకంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. మరి.. సైజ్ జీరో సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో..తమిళ ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో ఈనెల 27న తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com