రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

  • IndiaGlitz, [Tuesday,December 05 2017]

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం. యువ‌త‌నే కాకుండా కుటుంబ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించిన ఈ ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీ .. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాకుండా ప‌వ‌న్ ని యూత్ ఐకాన్ చేసేసింది. తొలి ప్రేమ విడుద‌లై 20 ఏళ్ల‌వుతున్నా.. ఆ సినిమాని మ‌ర‌పించే ప్రేమ క‌థ రాలేద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

ప‌వ‌న్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ లా నిలిచిన ఈ చిత్రం టైటిల్‌తో మ‌రో సినిమా రాబోతోంది. అయితే.. అది కూడా ఆ కుటుంబానికి చెందిన క‌థానాయ‌కుడిదే కావ‌డం విశేషం. ఫిదా త‌రువాత వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అంటే.. 1998లో ప‌వ‌న్ తొలి ప్రేమ వ‌స్తే.. 2018లో వ‌రుణ్ తొలి ప్రేమ వ‌స్తోంద‌న్న‌మాట‌. ఈ రెండు చిత్రాల‌కి సంబంధించిన ఓ కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. కొత్త ద‌ర్శ‌కులే వీటిని తెర‌కెక్కించ‌డం.

నాటి తొలి ప్రేమ‌ని క‌రుణాక‌ర‌న్ తాజ్‌మ‌హల్ అంత అందంగా తీర్చిదిద్దితే.. నేటి తొలిప్రేమ‌ని వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు. మ‌రి ఆ మ్యాజిక్‌ని ఈ కొత్త ద‌ర్శ‌కుడు రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. అంతేకాకుండా.. నాటి తొలిప్రేమ‌ని పంపిణీ చేసిన దిల్ రాజు నేటి తొలి ప్రేమ‌ని కూడా డిస్ట్రిబ్యూష‌న్ చేస్తున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. రెండు తొలిప్రేమ‌ల్లోనూ కామ‌న్ పాయింట్స్ బాగానే ఉన్నాయ‌న్న‌మాట‌.

More News

తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది - రమ్యకృష్ణ

'బాహుబలి'లో శివగామి క్యారెక్టర్‌లో అత్యద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా 'మాతంగి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ 'మాతంగి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తు

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి.. పొలిటిక‌ల్ మూవీ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయో ప‌్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు.

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా 'సైరా' షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెంచర్ ఇది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహ‌మాన్ తప్పుకున్న విషయం తెలిసిందే.

20 ఏళ్ల 'మా నాన్న పెళ్ళి'

చిన్నప్పుడే తల్లి చనిపోయిన కొడుకుని.. పెంచి పెద్ద చేయడం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఓ  తండ్రికి.. మళ్ళీ పెళ్లి చేయాలనుకునే కొడుకు కథే 'మా నాన్నకు పెళ్లి'.

విడుద‌ల‌కు ముందే ప‌వ‌న్ రికార్డులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాత‌వాసి'. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు.