అన్న‌య్య - త‌మ్ముడు ఒకేసారి..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి - త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్....వీళ్లిద్ద‌రు ఒకేరోజు త‌మ చిత్రాల‌ను ప్రారంభిస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అయితే... అన్నయ్య బాట‌లోనే త‌మ్ముడు ప‌వ‌న్ కూడా ఈనెల 29నే త‌న చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ చిత్రానికి ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిరు మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తుంటే...ప‌వ‌న్ మూవీకి అనూప్ సంగీతం అందిస్తున్నారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ త‌మ చిత్రాల ప్రారంభోత్స‌వంకు ఒకే రోజు ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటంటే...పుష్క‌రాల సంద‌ర్భంగా ఈనెల 29 దాటితే మంచి ముహుర్తాలు లేవ‌ట‌. అందుక‌నే ప‌వ‌న్ కూడా అన్న‌య్య సినిమా ప్రారంభోత్స‌వం రోజునే త‌న సినిమాని కూడా ప్రారంభిస్తున్నార‌ట అదీ అస‌లు సంగ‌తి.

More News

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్నయువ జంట‌..

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్న యువ జంట‌..ఎవ‌రో కాదు నాగ చైత‌న్య - స‌మంత‌. వీరిద్ద‌రు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆత‌ర్వాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో  న‌టించారు. తాజాగా నాలుగోసారి చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టిస్తున్నారు.

'కబాలి' టీజర్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.

బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే

బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి.

నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను

భద్ర,తులసి,సింహ,దమ్ము,లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఎన్టీఆర్ కోసం మహేష్...

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్.సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.