Game Changer : రామ్ చరణ్ - శంకర్ ‘‘గేమ ఛేంజర్’’ సినిమా సాంగ్ లీక్ , ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పట్లో పైరసీ భూతం తెలుగు సినిమాను పట్టి పీడంచగా.. ఇప్పుడు లీకులు బెడద వెంటాడుతోంది. షూటింగ్, తదితర సమయాల్లో ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం అవుతూనే వున్నాయి. కొన్నిసార్లు చిత్ర బృందం విడుదల చేస్తామని ప్రకటించిన సాంగ్స్, టీజర్స్, ఫస్ట్ లుక్.. అంతకంటే కొన్ని గంటల ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలోని ‘‘జరగండి’’ పాట లీకైంది. దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.
దీపావళి సందర్భంగా ‘‘జరగండి’’ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ , మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్ కలిసి తొలిసారి వర్క్ చేస్తుండంతో ఈ సినిమా ఆడియోపై భారీ అంచనాలున్నాయి. కానీ అంతలోనే ఈ సాంగ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్ భాషా, ఎస్సై భాస్కర్ రెడ్డి, ప్రసేన్ రెడ్డి, సాయి తేజ్ బృందం ఈ కేసును ఛేదించారు.
ఇకపోతే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments