భరత్ అనే నేను.. ఆ రెండూ కీలకమే
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్ తరువాత మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే.. టీజర్లో అమ్మకో ప్రామిస్ చేశా అంటూ మహేష్ చెప్పే డైలాగులో రెండు అంశాలు ఆసక్తిగా అనిపించాయి. ఒకటి.. తను చేసిన ప్రామిస్. రెండు.. ఆ ప్రామిస్ చేయించుకున్న అమ్మ.
ఆ ప్రామిస్ చుట్టూ సినిమా నడుస్తుంది కాబట్టి.. విడుదలయ్యే వరకు ఆ విషయం సస్పెన్స్‌గానే ఉంటుంది. ఇక రెండో విషయం.. ఆ అమ్మ ఎవరు? అనేది. ఈ చిత్రంలో నిన్నటి తరం కథానాయికలు ఆమని, సితార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరి కథలో కీలకమైన ఆ పాత్రలో ఆమని నటిస్తోందా? లేదంటే సితార నటిస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. అమ్మ, ప్రామిస్ అనే రెండు అంశాలపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వెయిట్ చేయకతప్పదు.
కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com