ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ 'యన్.టి.ఆర్'ను తేజ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. ఎన్టీఆర్ బయోపిక్‌లో క‌థ‌కు కీల‌క‌మైన‌ ఇందిరా గాంధీ పాత్ర కోసం.. ప్రముఖంగా ఇద్దరి సీనియర్ నటీమణుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. అందులో మొదటి పేరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా...రెండవ పేరు నదియా. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఇందిరా గాంధీ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

కింగ్ నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై.. 'అఖిల్' చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో..రీ-లాంచింగ్ అంటూ అఖిల్ రెండో సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ĵ

సెన్సార్ పూర్తి చేసుకున్న'గాయత్రి'

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న 'గాయత్రి' చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది. మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స&#

అ! ట్రైలర్ చూడగానే సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది - ఎస్.ఎస్. రాజమౌళి

నేచరల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై రూపొందుతున్న చిత్రం 'అ!'.

వేసవి నుంచి మహేష్ , సందీప్ చిత్రం?

ఒకే ఒక్క చిన్న సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

ప్రతిభావంతుడికి సాయిధరమ్‌ తేజ్‌ సాయం

సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్‌ యాదవ్‌ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్‌ నరేష్‌ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు.