ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ 'యన్.టి.ఆర్'ను తేజ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. ఎన్టీఆర్ బయోపిక్‌లో క‌థ‌కు కీల‌క‌మైన‌ ఇందిరా గాంధీ పాత్ర కోసం.. ప్రముఖంగా ఇద్దరి సీనియర్ నటీమణుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. అందులో మొదటి పేరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా...రెండవ పేరు నదియా. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఇందిరా గాంధీ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.