Revanth vs KCR: తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ట్విట్టర్ వార్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఇరువురు నేతలు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరతతో విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారంటూ కేసీఆర్ విమర్శిస్తే.. కేసీఆర్‌ను చూస్తే తప్పుడు ప్రచారం చేయటంలో దిట్ట అయిన గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని రేంవత్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Telangana CM and Dy CM were misleading the people on power, irrigation and drinking water supply in the state for the past 4 months.
— KCR (@KCRBRSPresident) April 29, 2024
Notice of Osmania University Chief Warden confirms that all their claims were farce.
The truth is that there is power, drinking water and… pic.twitter.com/PU213BFiuN
'కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయటం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయటం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట' అని విమర్శించారు.
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2024
మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్… pic.twitter.com/5MMPTzujBo
కాగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వటంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఓయూలో విద్యుత్ కోతలు, నీటి కష్టాల కారణంగా మే 1వ తేదీ నుంచి హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నామంటూ ఓ ప్రకటన సర్క్యులేట్ అయింది. దీనిపై కేసీఆర్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో వారి విమర్శలపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీలో విద్యుత్, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదంతా తప్పుడు ప్రచారమని ఖండించారు. మొత్తానికి ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల వేడి రాజుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments