Revanth vs KCR: తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ట్విట్టర్ వార్..

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఇరువురు నేతలు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరతతో విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారంటూ కేసీఆర్ విమర్శిస్తే.. కేసీఆర్‌ను చూస్తే తప్పుడు ప్రచారం చేయటంలో దిట్ట అయిన గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని రేంవత్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

'కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయటం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయటం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట' అని విమర్శించారు.

కాగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వటంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఓయూలో విద్యుత్ కోతలు, నీటి కష్టాల కారణంగా మే 1వ తేదీ నుంచి హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నామంటూ ఓ ప్రకటన సర్క్యులేట్ అయింది. దీనిపై కేసీఆర్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో వారి విమర్శలపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీలో విద్యుత్‌, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదంతా తప్పుడు ప్రచారమని ఖండించారు. మొత్తానికి ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల వేడి రాజుకుంది.

More News

TDP Alliance Manifesto:టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. పింఛన్ రూ.4వేలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో

Mehreen :పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు.. హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ నిర్ణయం..

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ'

Devi Prasad :తోటపల్లి మధు వ్యాఖ్యలపై దేవీప్రసాద్ కౌంటర్.. ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌.

ఎవరైనా ప్రముఖుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అదే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గురించి అయితే

Coromandel:రూ.1000కోట్లతో కాకినాడలో కోరమాండల్ ప్రాజెక్ట్

ఏపీలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎరువుల తయారీలో పేరొందిన కోరమాండల్‌ కంపెనీ కాకినాడ సమీపంలో

Corona Vaccine:కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టం నిజమే.. అంగీకరించిన సంస్థ..

నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక సంస్థలు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.