1.6 లక్షల ఖాతాలు రద్దు చేసిన ట్విట్టర్.. ఎందుకంటే..!
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాను జనాలు ఏ రేంజ్‌లో వాడుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బహుశా బ్యాంక్ అకౌంట్ లేని వారుంటారేమోగానీ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ అకౌంట్స్ లేని వారు చాలా వరకు ఉండరనే చెప్పుకోవచ్చు. సోషల్ మాధ్యమాల పుణ్యమా అని.. కొందరు అవసరాలకు వాడుకుంటుంటే.. మరికొందరు అనవసర, అసాంఘీక చర్యలకు వాడేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ.. రిక్రూట్మెంట్ అంటూ హడావుడి చేస్తుండటం.. మరికొందరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి.. ఆ భావ జాలాన్ని వ్యాపింపజేస్తూ రెచ్చగొడుతుంటారు.
ఈ నేపథ్యంలో.. ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ వేదికగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టాలని భావించిన సదరు యాజమాన్యం.. పలువురికి ఊహించని షాకిచ్చింది. గురువారం నాడు దాదాపు 1.6లక్షల ఖాతాలను తొలగించినట్లు ట్విటర్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది జులై-డిసెంబరు మధ్య 1,66,513 ఖాతాలను రద్దు చేసినట్లు కంపెనీ లీగల్ హెడ్ విజయా గడ్డె తన బ్లాగ్‌లో స్పష్టంచేశారు. అంతేకాదు గత ఏడాదితో పోలిస్తే ట్విట్టర్‌ను వినియోగించి ఉగ్రమూఠాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు. గత ఏడాది జనవరి నుంచి జూన్‌తో పోలిస్తే.. జూన్ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ట్వీట్స్ చేయడం, వాటిని షేర్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని గడ్డె పేర్కొన్నారు.
కాగా.. ఉగ్రవాదంపై ట్విట్టర్‌లో ఎక్కువయ్యాయని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని అమెరికా, జపాన్, భారత్ సహా పలు దేశాలు ట్విటర్ యాజమాన్యాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో నిశితంగా ఆలోచించిన యాజమాన్యం ఉగ్రవాదంపై ట్వీట్లు చేస్తున్న, ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని భావించి వారి ఖాతాలను పూర్తిగా తొలగించడం జరిగింది. మున్ముంథు ఎవరైనా ఇలాంటి పోస్ట్‌లు చేసినట్లు తెలిసినా కచ్చితంగా ఖాతాలను తొలగిస్తామని ట్విట్టర్ హెచ్చరికలు జారీ చేసింది. సో.. ఇలాగే ఫేస్‌బుక్ కూడా చర్యలు తీసుకుంటే మంచిదని పలువురు నిపుణులు కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments