దిశ కేసులో కీలక మలుపు.. తమను బెదిరిస్తున్నారంటూ..

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రలోభ పెడుతున్నారంటూ.. దిశ కమిషన్‌ను ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఇటీవల దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలున్నాయని
చెన్నకేశవులు తల్లి వెల్లడించింది. దిశ కేసులో కీలక విషయాలు బయట పెడతానని చెప్పడంతో.. కూర్మయ్యకు గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్ చేశారని ఆమె ఆరోపిస్తోంది.

హైకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నారని దిశ నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దిశ కేసులో శ్రీనివాస్‌రెడ్డిని పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని కమిషన్ ఎదుట దిశ నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసును వెనక్కి తీసుకోవాలని తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అనుమానాలన్నీ అఫిడవిట్ రూపంలో కమిషన్ ఎదుట ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. దిశ కేసు దర్యాప్తులో భాగంగా.. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి పోలీసులు తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకనస్ట్రక్షన్ నిర్వహిస్తుండగానే అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏం లేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు నిందితులుగా ఉన్న నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. దిశను హత్య చేసిన స్థలంలోనే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం.

More News

ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'లో ఫాద‌ర్‌-స‌న్ రిలేష‌న్‌షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది - హీరో రామ్ కార్తీక్‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న,

షర్మిల రాజకీయ పార్టీ.. జగన్‌కు పెద్ద దెబ్బే..

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో నూతన పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో

ఆ విషయం నేనెప్పుడూ ఊహించలేదు.. కన్నీళ్లొచ్చాయి: కృతి శెట్టి

హీరోయిన్‌గా తొలిసారిగా ‘ఉప్పెన’ సినిమా ద్వారా కృతిశెట్టి వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

టైమ్ లైన్ ఫిక్స్ చేసుకున్న జక్కన్న...!

మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ప్యాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’.