బిగ్‌బాస్ షో ప్రారంభం రోజే ట్విస్ట్‌లు.. అడుగడుగూ ఆసక్తికరం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను కనువిందు చేసేందుకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. అద్భుతమైన వ్యాఖ్యానంతో నాగ్.. సీజన్ 4ను ప్రారంభించారు. ఆసక్తికరమైన ఏవీలు, పెర్ఫార్మెన్స్‌లతో ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్లపై నాగ్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. మొత్తంగా ఆకట్టుకునే వ్యాఖ్యానంతో నాగ్ షోను అనుక్షణం ఆసక్తికరంగా నడిపించారు.
అద్భుతంగా బిగ్‌బాస్ హౌస్..
మొదటి మూడు సీజన్లతో పోలిస్తే.. 4వ సీజన్‌కు బిగ్‌బాస్ హౌస్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి గదినీ అందంగా అలంకరించారు. హౌస్‌ను చూసిన కంటెస్టెంట్‌ల ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారు. ఓ మంచి పాజిటివిటీని కంటెస్టెంట్లలో నింపేలా హౌస్ వాతావరణం ఉండటం విశేషం. హౌస్‌లోని సీక్రెట్ రూమ్‌ని సైతం అందంగా డిజైన్ చేశారు. ఈ సీక్రెట్ రూమ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లను తొలి రోజే పంపించడం ఆసక్తికరంగా మారింది.
అద్భుతమైన సాంగ్స్, ఏవీలతో కంటెస్టెంట్ల ఎంట్రీ..
బిగ్‌బాస్ సీజన్ 4 తొలి కంటెస్టెంట్‌గా ‘సరిలేరు నీకెవ్వరూ’లో స్పెషల్ సాంగ్‌తో ‘సుడిగాడు’ ఫేమ్.. గుజరాతి భామ మొనాల్ గజ్జర్ తొలి కంటిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. రెండవ కంటెస్టెంట్‌గా డైరెక్టర్ సూర్యకిరణ్ అదిరిపోయే ఏవీతో ఎంట్రీ ఇచ్చేశారు. మూడో కంటెస్టెంట్‌గా.. యాంకర్ లాస్యను ప్రకటించారు. అద్భుతమైన ఏవీతో లాస్య ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్ ఓ అద్భుతమైన ఫెర్మార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ సీజన్ 4.. ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ సుజాత ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన ఏవీలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో ఏడో కంటెస్టెంట్‌గా జర్నలిస్ట్ దేవి నాగవల్లి తెలిపారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిదవ కంటెస్టెంట్‌గా దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది.
షో ప్రారంభమైన రోజే అదిరిపోయే ట్విస్ట్..
ఈ షో ప్రారంభమైన తొలిరోజే బిగ్‌బాస్ నిర్వాహకులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా సయ్యద్ సోహైల్.. పదవ కంటెస్టెంట్‌గా అరియానా గ్లోరీ ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరినీ ప్రారంభం రోజే సీక్రెట్ రూమ్‌లోకి నాగ్ పంపించి గేమ్ స్టార్ట్ చేసేశారు. అనంతరం ఆకట్టుకునే ఏవీతో కరాటే కల్యాణి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే ర్యాప్‌తో ఎంట్రీ ఇచ్చిన 13వ కంటెస్టెంట్‌గా సింగర్ నోయెల్ ఎంట్రీ ఇచ్చారు. 14వ కంటెస్టెంట్ దివి.. నాగ్ నటించిన ‘ఊపిరి’ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 4.. 15వ కంటెస్టెంట్‌గా.. అఖిల్ సార్థిక్ ఎంట్రీ ఇచ్చారు. 16వ కంటెస్టెంట్‌గా ఆకట్టుకునే ఏవీతో గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా 16 మంది కంటెస్టెంట్లతో షో నేడు ప్రారంభమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments