ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ట్విస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసును ఇవాళ విచారించాల్సిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం. త్రివేది ధర్మాసనం విచారణను చివరి నిమిషంలో వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు విచారణ జరగాల్సి ఉంది.ఈరోజు విచారణకు ధర్మాసనం కూర్చోవడం లేదని.. విచారణకు మరో తేదిని ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు. అటు ఈ కేసులో విచారణకు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరుకాగా.. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు.
అయితే ఉదయం నుంచి ఈ కేసులో ఎలాంటి తీర్పు రానుంది? చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఆఖరి నిమిషంలో విచారణ వాయిదా పడింది. దీంతో మరికొన్ని రోజులు పాటు ఈ ఉత్కంఠ కొనసాగనుంది. కాగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఇప్పటికే పలు సార్లు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. చంద్రబాబుకు 17ఏ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై తీర్పు వచ్చాకే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని ఇదే ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కాగా మంగళవారం క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని తీర్పు ఇవ్వగా.. జస్టిస్ త్రివేది మాత్రం 17ఏ వర్తించదని తీర్పు ఇచ్చారు. దీంతో ఏకాభిప్రాయం కోసం ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేశారు. అయితే ఇద్దరు న్యాయమూర్తులు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడాన్ని మాత్రం సమర్థించడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఫైబర్ నెట్ వ్యవహారంలో రూ.115 కోట్ల నిధులు దారి మళ్లించారని సిట్ దర్యాప్తులో తేలినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్, A2 మాజీ ఎండీ సాంబశివరావును చేర్చింది. వేమూరి హరిప్రసాద్ చందబాబుకు అత్యంత సన్నిహితుడని.. ఈ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని ఆరోపిస్తుంది. లోతైన విచారణ చేయాల్సిన నేపథ్యంలో చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరింది. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com