పందెంకోడి వేలంలో సూపర్ ట్విస్ట్.. వేలం ఆపాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

ఆర్టీసీ అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఓ వ్యక్తి ఆ కోడి తనదే వేలం ఆపాలని కోరాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఈనెల 9వ తేదీన వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగింది. అయితే ఆ సమయంలో ఓ ప్రయాణికుడు బస్సులో బ్యాగును వదిలి దిగాడు. బ్యాగును గమనించిన ఇతర ప్రయాణికులు అధికారులకు సమాచరం ఇచ్చారు. దీంతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బ్యాగులో ఏముందో తెలుసుకునేందుకు దానిని తెరిచారు.

అయితే అందులో ఓ పందెంకోడి చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ కోడిని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌ రెండో డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది కోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఆ కోడిని తీసుకుని వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇవాళ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న ఓ ప్రయాణికుడు కోడి తనదేంటూ ముందుకొచ్చాడు.

ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వల్లపు మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంకాంత్రి పండుగకు ఊరు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తన బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి బయలుదేరాడు. అయితే రాత్రి 12 గంటల సమయంలో నిద్రమత్తులో కరీంనగర్‌లో బస్సు దిగాడు. కానీ కోడి మర్చిపోయిన సంగతి గుర్తుకువచ్చి బస్సు కోసం పరిగెత్తగా అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు తెలిపాడు. కోడి వేలం పాట గురించి తెలియడంతో వేలం ఆపాలని అధికారులను కోరాడు. కోడి తనదేనన్న ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఇదన్న మాట పందెంకోడి వేలం సంగతి.

More News

Kalki 2898 AD Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్బ్ న్యూస్.. 'కల్కి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

'సలార్' హిట్‌తో మంచి జోరు మీదున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న

Mahesh Babu: అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' మూవీ చూసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాబు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు ఇరగదీశాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Akshay Kumar: మెట్రో రైలులో ప్రయాణించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో ట్రాఫిక్ కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జెంట్ పని మీద సొంత వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల్లో రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే గంటల మేర ట్రాఫిక్‌లో

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి.

Hanuman Vs Adipurush: 'హనుమాన్' వర్సెస్ 'ఆదిపురుష్'.. ప్రశాంత్‌ వర్మ దెబ్బకు ఓం రౌత్ అబ్బా..

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(HanuMan) చిత్రం