పందెంకోడి వేలంలో సూపర్ ట్విస్ట్.. వేలం ఆపాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్టీసీ అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఓ వ్యక్తి ఆ కోడి తనదే వేలం ఆపాలని కోరాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఈనెల 9వ తేదీన వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగింది. అయితే ఆ సమయంలో ఓ ప్రయాణికుడు బస్సులో బ్యాగును వదిలి దిగాడు. బ్యాగును గమనించిన ఇతర ప్రయాణికులు అధికారులకు సమాచరం ఇచ్చారు. దీంతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బ్యాగులో ఏముందో తెలుసుకునేందుకు దానిని తెరిచారు.
అయితే అందులో ఓ పందెంకోడి చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ కోడిని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్ రెండో డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది కోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఆ కోడిని తీసుకుని వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇవాళ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న ఓ ప్రయాణికుడు కోడి తనదేంటూ ముందుకొచ్చాడు.
ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వల్లపు మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంకాంత్రి పండుగకు ఊరు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తన బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి బయలుదేరాడు. అయితే రాత్రి 12 గంటల సమయంలో నిద్రమత్తులో కరీంనగర్లో బస్సు దిగాడు. కానీ కోడి మర్చిపోయిన సంగతి గుర్తుకువచ్చి బస్సు కోసం పరిగెత్తగా అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు తెలిపాడు. కోడి వేలం పాట గురించి తెలియడంతో వేలం ఆపాలని అధికారులను కోరాడు. కోడి తనదేనన్న ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఇదన్న మాట పందెంకోడి వేలం సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout