ఇదేం ట్విస్టు.. 'విరాటపర్వం' నక్సలిజం కథ కాదా ?
- IndiaGlitz, [Saturday,June 05 2021]
అవకాశం ఉన్నప్పటికీ దగ్గుబాటి రానా కమర్షియల్ చిత్రాలు జోలికి వెళ్లడం లేదు. బహుశా ఒకే రకమైన ఇమేజ్ లో ఇరుక్కుపోవడం ఇష్టం లేదేమో.. అందుకే రానా కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథలపైనే ఫోకస్ పెడుతున్నాడు. ఆ కోవకు చెందిన చిత్రమే విరాటపర్వం.
నీది నాది ఒకే కథ చిత్రంతో దర్శకుడిగా వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విరాటపర్వంతో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. విరాటపర్వం చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: హాట్ పిక్స్ : 'ఏక్ మినీ కథ' హీరోయిన్ తడి అందాలు.. అలెర్ట్ చేస్తోందిగా!
అయితే తాజాగా దర్శకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ చిత్ర కథపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విరాటపర్వం చిత్రం 90వ దశకంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలిపారు. రానా నక్సలైట్ గా నటిస్తున్నప్పటికీ ఇది ప్రేమ కథ.
90వ దశకంలో కథ కాబట్టి ఆ సమయంలో ప్రజల జీవితాల్లో నుంచి నక్సలిజంని తీసిపారేయలేం. ఈ చిత్రంలో నక్సలిజంని పూర్తి స్థాయిలో చూపించడం లేదు.. అలాగే చర్చించడం కూడా లేదు అని వేణు ఊడుగుల అన్నారు.
ఆ సమయంలో తెలంగాణాలో పరిస్థితులు ఎలా ఉండేవి అని ఇప్పటి జనరేషన్ చాలా మందికి తెలియదు. అప్పటి పరిస్థితులని రివైండ్ చేసినట్లుగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. వేణు చెప్పినదాని బట్టి చూస్తే.. విరాటపర్వం బ్యాగ్రౌండ్ లో నక్సలిజం ఉన్నప్పటికీ ప్రధానంగా లవ్, ఎమోషన్స్ మీదే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ మధ్యన విడుదలైన విరాటపర్వం టీజర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఈ చిత్రాన్ని కరోనా ప్రభావం తగ్గాక థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా లేక ఓటిటిని ఆశ్రయిస్తారా అనేది వేచి చూడాలి. నందిత దాస్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్.