ముఖంపై ఉమ్మేసి, కొట్టించి... రివర్స్‌లో కేసు పెట్టిన టీవీ నటి?
Send us your feedback to audioarticles@vaarta.com
హిందీ సీరియల్ 'యే రిష్తా క్యా కెహతా హై' యాక్టర్ కరణ్ మెహ్రాను మండే నైట్ ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడిపై వైఫ్, టీవీ నటి నిషా రావల్ కేసు పెట్టింది. భర్త దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం కరణ్ మెహ్రాకు బెయిల్ వచ్చింది. జైలు నుండి బయటకొచ్చిన తరువాత భార్య చేసిన ఆరోపణలను అతడు ఖండించాడు. ముఖంపై ఉమ్మేసి, రాఖీ బ్రదర్‌తో కొట్టించి, రివర్స్‌లో కేసు పెట్టిందని కరణ్ మెహ్రా వాపోయాడు.
కరణ్ మెహ్రా చెప్తున్న వివరాల ప్రకారం... అభిప్రాయ భేదాలు రావడంతో కరణ్, నిషా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి చండీగఢ్ నుంచి కరణ్ ముంబయ్ వచ్చా. నిషా రాఖీ బ్రదర్ రోహిత్ ను పిలిచాడు. మండే ఫైనాన్షియల్ డిస్కషన్స్ వచ్చాయి. భరణం, ఇతర వివరాలు చర్చకు వచ్చాయి. నిషా డిమాండ్స్, రోహిత్ చెప్పే ఫిగర్ ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. దాంతో టైమ్ తీసుకుని ఆలోచించుకోమని చెప్పాడు. నైట్ 10కి కరణ్ రూమ్ కి వెళ్ళిన రోహిత్, నిషా మరోసారి డిస్కషన్స్ చేశారు. కోర్టులో తేల్చుకుందామని కరణ్ చెప్పడంతో నిషా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తిడుతూ ముఖంపై ఉమ్మేసింది. అంతటితో ఆగకుండా గోడకేసి తలను బాదుకుంది. ఈలోపు బయటకు వెళ్ళొచ్చిన రోహిత్ తో తనపై దాడి చేశాడని చెప్పడంతో అతడు కరణ్ మెహ్రాను కొట్టాడు. రివర్స్‌లో కేసు పెట్టారు.
జైలు నుండి బెయిల్ మీద రిలీజైన కరణ్ మెహ్రా చెప్పిన వెర్షన్ అది. ప్లాన్ ప్రకారం ఫ్లాట్ లో కెమెరాలు ఆఫ్ చేసి కొట్టారని, రివర్స్‌లో కేసు పెట్టారని కరణ్ మెహ్రా ఆవేదన చెందాడు. గర్ల్ పవర్ ను ఇలా యూజ్ చెయ్యడం దారుణమన్నాడు. ముంబయ్ వచ్చాక కొవిడ్19 బారిన పడి కోలుకుంటున్నానని, ఎనర్జీ లెవల్స్ పడినపోయిన సమయంలో ఎటాక్ ఎలా చెయ్యగలనని ప్రశ్నించాడు. కరణ్ మెహ్రాపై కేసు నమోదు చేసుకున్న ముంబయ్ పోలీసులు, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com