తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లే గొప్ప సినిమాలు తీస్తాను - కుమార్ నాగేంద్ర
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ - లతా హెగ్డే జంటగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తుంటరి. శ్రీ కీర్తి ఫిల్మ్ బ్యానర్ పై అశోక్, నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ఈ చిత్రాన్నిరిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా తుంటరి డైరెక్టర్ కుమార్ నాగేంద్ర తో ఇంటర్ వ్యూ మీకోసం...
మీ గురించి..?
మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో కృష్ణవంశీ గారి దగ్గర ఖడ్గం నుంచి రాఖీ వరకు వర్క్ చేసాను. అప్పుడు లక్ష్మీ ప్రసన్నగారు ఫోన్ చేసి...స్ర్కిప్ట్ ఉంటే చెప్పండి అవకాశం ఇస్తాను అన్నారు. నేను కథ చెప్పడం నచ్చడంతో గుండెల్లో గోదారి చేసాం. ఆతర్వాత జోరు సినిమా చేసాను.ఇప్పుడు తుంటరి సినిమా చేసాను.
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
జోరు సినిమా తర్వాత చెన్నై వెళ్లినపుడు నా కెమెరామెన్ తుంటరి తమిళ వెర్సెన్ గురించి చెప్పాడు. శివ కార్తికేయన్, హన్సిక జంటగా మురుగుదాస్ కథతో ఆయన అసోసియేట్ ఈ చిత్రాన్ని తమిళ్ లో డైరెక్ట్ చేసారు. ఈ సినిమా దాదాపు 55 కోట్లు వసూలు చేసి బ్లాక్ బష్టర్ గా నిలిచింది. చెన్నైలో ఈ సినిమా చూసిన వెంటనే ఇది తెలుగులో తీస్తే బాగుంటుందనిపించింది. రైట్స్ తీసుకున్నాం. రౌడీ ఫెలో టైంలో కృష్ణ చైతన్యకి చెబితే ఆయన నారా రోహిత్ కి చెప్పారు. ఆయన సినిమా చూసాను నచ్చింది అని కృష్ణ చైతన్యతో చెప్పారట. ఆతర్వాత మేము నారా రోహిత్ ని కలిసాం.ఆయన ఓకే అనడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం.
తుంటరి కథ ఏమిటి..?
గతంలో మమ్ముటి నటించిన సూర్య ది గ్రేట్ అనే సినిమా వచ్చింది. ఆతరహాలో ఉండే సినిమా ఇది. ఇందులో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? అనేది చూపించాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే...నాలుగు నెలల తర్వాత వచ్చే న్యూస్ పేపర్ ఇప్పుడే మన చేతిలో పడితే ఎలా ఉంటుంది..? అలా జరిగినప్పుడు దానిని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు ఓ టీమ్.ఆతర్వాత ఏం జరిగింది అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.
తెలుగు నేటివిటీకి తగ్గట్టు తుంటరిలో మార్పులు చేసారా..?
ఓరిజినల్ వెర్సెన్ రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది. తమిళ్ లో క్లైమాక్స్ 25 నిమిషాలు ఉంటుంది. మనకు అంత ఉంటే బాగోదనిపించి తగ్గించాం. అలాగే లవ్ ట్రాక్ కూడా మార్పులు చేసాం. రెండున్నర గంటల సినిమాని రెండు గంటలు చేసాను.
నారా రోహిత్ బాక్సర్ గా కనిపిస్తాడా..?
అవును..అంటే సీరియస్ బాక్సర్ కాదు..ఫన్నీ బాక్సర్. ఆయన్ని బాక్సర్ అనుకుని మనీ ఇన్వేస్ట్ చేస్తారు. అది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.
ఈ సినిమాకి మురుగుదాస్ కథ అందించారు కదా...తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు ఆయన సలహాలు తీసుకున్నారా..?
రైట్స్ తీసుకున్న వెంటనే మురుగుదాస్ గార్ని కలిసాను. మురుగుదాస్ గారు, ఆయన అసోసియేట్ కలసి పాజిటివ్ గా చెప్పారు. లవ్ ట్రాక్ కొంచెం ఛేంజ్ చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. ఆయన చెప్పినట్టే లవ్ ట్రాక్ లో మార్పులు చేసాను.
తుంటరి సినిమాని ఎందుకు చూడాలి అంటే ఏం చెబుతారు..?
సినిమా అంతా ఎంటర్ టైన్మెంట్ తో ఉంటుంది. అలాగే హీరో రోహిత్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. సోలో కంటే ఎక్కువ ఎనర్జి ఈ సినిమాలో ఉంటుంది. సాయి కార్తీక్ కెరీర్ లో బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి అందించారు. లాస్ట్ 40 నిమిషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో చూసేలా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఈ సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు.
స్ట్రైయిట్ సినిమా, రీమేక్ ఈ రెండింటిలో మీకు ఏది కంఫర్ట్ గా అనిపించింది..?
స్ట్రైయిట్ సినిమానే బాగుంటుంది. ఎందుకంటే రీమేక్ సినిమా చేస్తే పెద్దగా వర్క్ ఉండదు అనిపించింది. అలాగే స్ట్రైయిట్ సినిమా అయితే ఎలా వస్తాదో నాకే తెలియదు..ఇలా రావాలి అని ట్రై చేస్తాను. రీమేక్ అంటే యూనిట్ లో అందరికీ తెలుస్తుంది. అందుచేత నేను ఎంజాయ్ చేసేది స్ట్రైయిట్ సినిమానే.
జోరు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటి..?
తక్కువ బడ్జెట్ లో చేయాలనేది నన్ను ఎక్కువ డామినేట్ చేసింది. అలాగే గుండెల్లో గోదారి సినిమాలో ఒకటి రెండు సినిమాలు చేసిన ఆర్టిస్టులు ఉండడం వలన నాకు సెట్ లో బాగా కమెండింగ్ ఉండేది. జోరు లో దాదాపు 25 మంది సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారందరూ సెట్ లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం విలువైంది. వన్ మోర్ చెబితే..ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో...బడ్జెట్ పెరుగుతుందో అనే ఆలోచనకి వెళ్లిపోయాను. దాని వలన ఏమౌందంటే వాళ్లు ఇచ్చిందే నేను తీసుకోవడం జరిగింది. ఆ బడ్జెట్ భయం వలనే జోరు సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నాను. అలాగే స్ర్కిప్ట్ బాగా రాసుకున్నాను అనుకున్నాను...కానీ...కన్ ఫ్యూజన్ కామెడీ రెండు మూడు సార్లు చూస్తేనే కానీ అర్ధం కావడం లేదు. అది కూడా జోరు సక్సెస్ కాకపోవడానికి కారణం.
మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది..?
బాపు గారు, జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ గారు...వీళ్లు ఒక్కొక్కరు ఒక్కో ఎమోషన్ ని బాగా తీయగలరు. టైటానిక్ తరహా సినిమాలంటే నాకిష్టం.
ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?
ప్రేక్షకులు రెండున్నర గంటలు విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారంటే...వాళ్లకి ఏదో మంచి చెప్పాలనుకుంటాను.అలాగే తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లేలా గొప్ప సినిమాలు తీయాలనుకుంటున్నాను. నేను తీసిన మూడు సినిమాలు నా స్ధాయి సినిమాలు కాదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి..?
ఈ సినిమా రిజల్ట్ ను బట్టి ఉంటుంది. త్వరలోనే పూర్తి వివరాలు చెబుతాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com