'తుంటరి' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న తుంటరి' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాత‌లు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ ఫిభ్రవరి 19న హైదరాబాద్ లోని జయభేరి ఆడిటోరియంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వంః కుమార్ నాగేంద్ర‌.

More News

సమంత షరతులు

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అవుతున్న హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగులో నితిన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రంలో నటిస్తుంది.

సుప్రీమ్ రిలీజ్ డేట్....

పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’.

చిరు చిన్న‌ల్లుడు ఇత‌నే

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవ‌డం..ఆత‌ర్వాత విడాకులు తీసుకోవ‌డం తెలిసిందే. అయితే... చిరుకి ప్రాణ‌మైన రెండో కుమార్తె శ్రీజ‌కి రెండో వివాహాం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

స్నేహితుడికి నితిన్ సపోర్ట్

ఇప్పుడున్న తరం హీరోలు ఒకరితో ఒకరు కలివిడిగానే ఉంటున్నారు. చాలా ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్స్ లో ఈ విషయాలు మనకు తేటతెల్లమయ్యాయి.

జిబ్రాన్ ఆ విషయంలో టెన్షన్ పడ్డాడట..

ఉత్తమవిలన్, చీకటి రాజ్యం, రన్ రాజా రన్, జిల్ చిత్రాలను మ్యూజిక్ అందించిన జిబ్రాన్ ఇప్పుడు వెంకటేష్, మారుతి కాంబినేష్ లో రూపొందుతోన్న బాబూ..బంగారం చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.