గూగుల్‌కే ఊహించని షాకిచ్చిన ‘లేడీ’..!!

  • IndiaGlitz, [Friday,July 26 2019]

గూగుల్ అంటే తెలియని వారుండరు.. దీన్ని ప్రతిరోజూ వాడకుండా ఉండలేరు కూడా. నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ఈ గూగుల్‌తోనే అంతా పని. ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మీద ఆధారపడే వారే, అయితే.. అలాంటి ‘గూగుల్’కే అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఇచ్చిందెవరు..? ఎందుకిచ్చారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందు వరుసలో డెమోక్రాట్‌ ప్రతినిధి తులసి గబ్బర్డ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈమెపై ప్రచార ప్రకటనల ప్రసారాలపై గూగుల్‌ వివక్షా పూరితంగా వ్యవహరించిందని సంచలన ఆరోపణలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె లాస్ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులోతనకు 50 మిలియన్‌ డాలర్ల (సుమారు 3వేల 452 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని అని డిమాండ్ చేస్తూ ఆమె పరువు నష్టం దావా వేశారు. ఈ షాకింగ్ విషయాన్ని న్యూయర్క్‌కు చెందిన ఓ పత్రిక వెలుగులోకి తెచ్చింది. కాగా గూగుల్‌పై దావా వేసిన రాజకీయ ప్రతినిధి ఎవరూ లేరు. అయితే గూగుల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ గబ్బర్డ్‌ ఇలా దావా వేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ వ్యక్తిగా రికార్డు సృష్టించిన తులసీ గబ్బర్డ్ అన్న విషయం తెలిసిందే.

అసలు కథ ఇదీ..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గూగుల్‌పై తిట్టిపోశారు. ‘జూన్ 27-28 తేదీల్లో రాత్రిపూట ఆరు గంటలపాటు ప్రచారం మా ప్రకటనల ఖాతాను గూగుల్ నిలిపివేసింది. దీంతో మాకు 50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. నా ప్రచార అకౌంట్‌ గంటల తరబడి ఆఫ్‌లైన్‌లోనే ఉంది. ఎలాంటి వివరణ లేకుండా గూగుల్ నిలిపివేసింది. ఇంటర్నెట్ శోధనలో గూగుల్‌ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమైనదో గూగుల్‌ వైఖరి చూస్తో అర్థమవుతోంది. ఇలా చేయడం వల్ల ధోరణి భావస్వేచ్ఛకు, నిష్పక్షపాత ఎన్నికలకు, అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమే. అమెరికా ప్రజల తరపున దీనిపై నేను పోరాడుతాను అని ఆమె తేల్చిచెప్పారు.

గూగుల్ రియాక్షన్ ఇదీ..!

ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ.. అసాధారణ యాక్టివిటీ మూలంగానే ఆ అకౌంట్‌ బ్లాక్‌ అయిందని సింగిల్ మాటలో తేల్చేసింది. అయితే దావా విషయంపై మాత్రం గూగుల్ రియాక్ట్ కాలేదు. తులసి డిమాండ్ చేసినట్లుగా గూగుల్ అంత డబ్బులు చెల్లిస్తుందా..? లేకుంటే సింపుల్‌గా వివరణ ఇచ్చుకుని మరోసారి రిపీట్ కానివ్వమని చెప్పేసి మిన్నకుండిపోతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

More News

కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!

ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం.

పేరు మార్చుకుని సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం

కర్ణాటక కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు. కాగా మొదట శుక్రవారం నాడు ఇదివరకున్న యడ్యూరప్ప అనే పేరును ‘యడియూరప్ప’గా మార్చుకుని సీఎం పీఠమెక్కారు. రాజ్ భవన్‌లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా..

'మనం సైతం' కు అండగా ఉంటా... కేటీఆర్

మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

'కొబ్బ‌రి మ‌ట్ట' నైజాం, ఒవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న నో బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

హ్రుద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో

చిరుకోసం పూరి ఇస్మార్ట్

రామ్ హీరోగా తెలంగాణ యాస‌లో మాస్ మ‌సాలాగా న‌టించిన సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని,