తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్క టీటీడీలోనే కరోనా కేసులు 150కి పైగా నమోదయ్యాయి. తాజాగా ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరికి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ అర్చకుడిని మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు. పెద్ద జీయంగార్‌ను కూడా చెన్నై అపోలోకి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం టీటీడీలో మిగిలిన అర్చకులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మాకు బదిలీ సౌకర్యం కల్పించండి!
కరోనా వైరస్ టీటీడీలో విజృంభిస్తోందని.. తమలో చాలా మంది అర్చకులు కరోనా బారిన పడ్డారని ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు పేర్కొన్న విషయం తెలిసిందే. కరోనా గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదని వారు వాపోయారు. అయితే భక్తుల వలన తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఇటీవల తెలిపారు. క్యూలైన్‌కు సమీపంలో అర్చకులెవరూ విధులు నిర్వహించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అర్చక బృందమంతా వెళ్లి టీటీడీ చైర్మన్‌ను కలిసింది. తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బదిలీ సౌకర్యం కల్పించాలని కోరింది.
కీలక నిర్ణయం దిశగా టీటీడీ!
శ్రీవారి ఆలయంలో కరోనా విజృంభిస్తుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు... ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఓ సందర్భంటో వెల్లడించారు. దీనికి 128 ఏళ్ల తర్వాత కరోనా కారణంగా భక్తుల దర్శనాలను నిలిపివేయడం కరోనా కారణంగానే జరిగింది. కాగా.. టీటీడీ మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అర్చకులతో పాటు టీటీడీ సిబ్బంది మొత్తం కరోనా బారిన పడుతుంటడం.. అదీ కూడా దర్శనాలు ప్రారంభమైన నాటి నుంచే జరుగుతుండటంతో మరోమారు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నేడో.. రేపో ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout